టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ కోల్పోయారని, రిటైర్మెంట్ తీసుకుంటాడని కొన్ని విమర్శలు వినిపిస్తున్న సమయంలో, అతను బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాడు.ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో, చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. శతకం పూర్తి చేశాక హెల్మెట్ కూడా తీయకుండా, కేవలం బ్యాట్ పైకెత్తి సింపుల్ గా అభివాదం చేశాడు.
Indoor:ఆసీస్ మహిళా క్రికెటర్ల పై వేధింపులు నిందితుడిని పట్టుకున్న పోలీసులు
రోహిత్ (Rohit Sharma) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలుపు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్‌లో 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, తాజా సమాచారం అందేసరికి 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 105 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ (Virat Kohli) 68 బంతుల్లో 59 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత విజయానికి ఇంకా కేవలం 37 పరుగులు మాత్రమే అవసరం కాగా, చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.లక్ష్య ఛేదనలో శుభ్‌మన్ గిల్ (24) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 131 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయానికి చేరువ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: