టీమిండియా వన్డే కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Hitman Rohit Sharma) మరోసారి మైదానాన్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కొంతకాలం విరామం తీసుకున్న ఆయన, తాజాగా తన రాబోయే క్రికెట్ ప్రయాణానికి శుభారంభం చేశారు. బుధవారం రోహిత్ తన ప్రాక్టీస్ సెషన్‌లోని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
అతను షేర్ చేసిన చిత్రాల్లో మొదటిది జిమ్ వర్కౌట్ చేస్తూ ఉండగా, మరొకదాంట్లో ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌కి సన్నద్ధమవుతున్న దృశ్యం కనిపించింది. ఈ రెండు ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యి, అభిమానుల మనసులను దోచేశాయి. చాలామంది అభిమానులు కామెంట్స్ విసురుతూ, “హిట్‌మ్యాన్ మళ్లీ బరిలోకి దిగుతున్నాడంటే అసలైన పండుగ మాకే” అని రాశారు. మరికొందరు ఆయన రాబోయే 2027 ప్రపంచకప్ (2027 World Cup) కోసం శక్తివంతమైన ప్రాక్టీస్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
పెద్ద మ్యాచ్‌లలో ప్రెషర్‌ని తట్టుకొని జట్టుకి విజయాన్ని అందించడం
రోహిత్ శర్మ గత రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌లో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. పెద్ద మ్యాచ్‌లలో ప్రెషర్‌ని తట్టుకొని జట్టుకి విజయాన్ని అందించడం ఆయన ప్రత్యేకత. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఆయన పేరు గిన్నిస్‌లో నిలిచిపోయింది. అందువల్లే అభిమానులు ఆయనను మైదానంలో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇటీవలే టెస్ట్, టీ20 ఫార్మాట్ల (Test and T20 formats) నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇకపై ఆయన వన్డే క్రికెట్ (ODI Cricket) పైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం రోహిత్ ఇప్పుడు సన్నద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యారు.
ఆస్ట్రేలియా గడ్డపై హిట్‌మ్యాన్‌కు అద్భుతమైన రికార్డు
వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు 273 వన్డే మ్యాచ్‌లలో 11,168 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై హిట్‌మ్యాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 30 మ్యాచ్‌లలో 5 సెంచరీలతో సహా 1,328 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రాబోయే సిరీస్‌లో రోహిత్ ఎలా రాణిస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: