हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అవసరం ఉంది: దినేశ్‌ కార్తీక్

Anusha
Latest News: Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అవసరం ఉంది: దినేశ్‌ కార్తీక్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే 38 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్,ఇంకోసారి ప్రపంచకప్ ఆడతాడా? అనే ప్రశ్నలు అభిమానులను, నిపుణులను కుతూహలానికి గురిచేస్తున్నాయి.ముఖ్యంగా, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ పాల్గొనడం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also: ICC award: స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు

ఈ నేపథ్యంపై భారత మాజీ వికెట్ కీపర్, వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.కార్తీక్ మాట్లాడుతూ, రోహిత్ శర్మ ఇంకా భారత జట్టుకు ఎంతో అవసరమని, అతని అనుభవం, నాయకత్వం రాబోయే సంవత్సరాల్లో కూడా కీలకమని అభిప్రాయపడ్డాడు. “2023 వన్డే ప్రపంచకప్ (2023 ODI World Cup) ఫైనల్‌లో ఓటమి తర్వాత రోహిత్ మనసులో ఇంకా ఆ బాధ మిగిలే ఉంది.

50 ఓవర్ల ప్రపంచకప్‌ను గెలవాలని అతనికి ఉన్న తపన ఇప్పటికీ తగ్గలేదు” అని ఆయన తెలిపారు.రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ ఫామ్‌ను కార్తీక్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. “2023 ప్రపంచకప్ తర్వాత రోహిత్ గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అతను 48 సగటుతో వెయ్యికి పైగా పరుగులు సాధించాడు.

Rohit Sharma
Rohit Sharma

వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడటం లేదు

అతని స్ట్రైక్ రేట్ గురించి మనందరికీ తెలిసిందే. రాబోయే 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుంటే, బ్యాటర్‌గా రోహిత్ జట్టుకు చాలా ముఖ్యం. అతను పూర్తి మనసు పెట్టి ఆడితే, కచ్చితంగా ఆ టోర్నీలోనూ రాణిస్తాడనే నమ్మకం నాకుంది” అని డీకే పేర్కొన్నాడు.పవర్‌ప్లేలో రోహిత్ ఆడే దూకుడైన ఆట జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు.

“రోహిత్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతని బ్యాటింగ్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌలర్లపై నిర్భయంగా దాడి చేసి, మిగతా బ్యాటర్లకు బలమైన పునాది వేస్తాడు. అతను ఇప్పుడు వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడటం లేదు, జట్టు కోసం ఆడుతున్నాడు. అతని నిస్వార్థ వైఖరి జట్టుకు ఎంతో స్ఫూర్తినిస్తోంది” అని దినేశ్‌ కార్తీక్ కొనియాడాడు.

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవడం సరైన నిర్ణయమని మీరు భావిస్తున్నారా?

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870