
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా ఒక వీడియోలో వైరల్ అయ్యారు. ఈ వీడియోలో తనను చూసేందుకు వచ్చిన ఓ చిన్నారి అభిమానిని అడ్డుకున్న సెక్యూరిటీకి రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యం కనిపిస్తోంది. చిన్నారిని అడ్డుకున్న సెక్యూరిటీని ఆయన “నా అభిమానిపైనే చేయి వేస్తావా?” అని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.
Ravindra Jadeja: ఆస్ట్రేలియా వన్డే సిరీస్..తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన జడేజా
ముంబైలోని శివాజీ పార్క్ స్టేడియంలో రోహిత్ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ (ODI series) కోసం రోహిత్ శర్మ సన్నదమవుతున్న విషయం తెలిసిందే. టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) పర్యవేక్షణలో రోహిత్.. ఆసీస్ పర్యటనకు సిద్దమవుతున్నాడు. గంటల కొద్దీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ముఖ్యంగా భారీ షాట్స్ ఆడటంపై ఫోకస్ పెట్టాడు. అతను కొట్టిన ఓ సిక్సర్ నేరుగా రోహిత్ లాంబోర్గినీ కారు (Lamborghini car) అద్దాలను ధ్వంసం చేసింది.రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఈ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రోహిత్ వైపు దూసుకొచ్చిన ఓ చిన్నారి అభిమానిని సెక్యూరిటీ అడ్డుకుంది.
సెక్యూరిటీ సిబ్బంది
ఆ చిన్నారితో సెక్యూరిటీ సిబ్బంది కాస్త దురుసుగానే ప్రవర్తించింది. ఈ విషయాన్ని గమనించిన రోహిత్.. సెక్యూరిటీ (Security) పై అరుస్తూ.. అతన్ని పంపించాలని సూచించాడు. అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబడుతూ వారిని మందలించాడు.
రోహిత్ సూచనలతో సదరు అభిమానిని సెక్యూరిటీ వదిలేయగా.. అతను సెల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్స్ కోసం అభిమానులు ఎగబడటంతో అభిషేక్ నాయర్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు.
వన్డే ప్రపంచకప్ 2027 ఆడటంపై సందేహం
రోహిత్‌కు అసౌకర్యం కలిగించవద్దని వేడుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027) ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్.. అందుకోసం అన్ని విధాల సన్నదమవుతున్నాయి. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన రోహిత్..
20 కేజీల బరువు తగ్గాడు. సన్నగా మారిపోయాడు. మరోవైపు టీమిండియా మేనేజ్‌మెంట్ (Team India Management) మాత్రం రోహిత్, కోహ్లీ.. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటంపై సందేహంగా ఉంది. అప్పటికి రోహిత్ వయసు 40 ఏళ్లకు చేరనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: https://epaper.vaartha.com/
Read Also: