భారత స్టార్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ సరికొత్త ఘనత సాధించాడు. ఆదివారం బరోడా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకోవడం విశేషంగా నిలిచింది. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.301 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు.
Read also: IND vs NZ: తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం
క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఆరో ఓవర్లో మొదటి సిక్స్ కొట్టిన రోహిత్, ఆ తర్వాతి ఓవర్లో కైల్ జేమీసన్ బౌలింగ్‌లో మరో భారీ సిక్స్ బాది రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు.

అయితే, ఈ మెరుపు ఆరంభాన్ని రోహిత్ (Rohit Sharma) భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఓపెనర్‌గా క్రిస్ గేల్ 328 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, తాజా మ్యాచ్‌లో రోహిత్ (329) ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: