తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన అరుదైన క్షణం ఉప్పల్ స్టేడియంలో అభిమానులను ఆకట్టుకుంది. గోట్ కప్ పేరుతో జరిగిన ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో రేవంత్ రెడ్డి తన మనవడికి ఆటలో సూచనలు చేస్తూ సరదాగా పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకాగా, స్టేడియానికి వచ్చిన ముఖ్యమంత్రి భార్య గీతా రెడ్డిని ఆయన సాదరంగా పలకరించారు.
Read also: Rahul Gandhi: హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
మ్యాచ్ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మెస్సీకి తెలంగాణ తరఫున ఆత్మీయ స్వాగతం పలికారు. “నౌ తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైజ్” అంటూ రాష్ట్ర అభివృద్ధి దిశను సూచించే సందేశాన్ని ఇచ్చారు. గోట్ కప్ మ్యాచ్‌లో రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున, మెస్సీ అపర్ణ మెస్సీ జట్టు తరఫున మైదానంలోకి దిగగా, ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సింగరేణి ఆర్ఆర్ జట్టు 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: