
భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో (Republic Day 2026) ప్రత్యేక అతిథిగా పాల్గొనాల్సిందిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆమెకు అధికారికంగా ఆహ్వాన లేఖ అందింది. ఇటీవల జరిగిన తొలి అంధుల మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును టైటిల్ విజేతగా నిలిపిన దీపిక ప్రతిభను గుర్తించి రాష్ట్రపతి ఈ ఆహ్వానం పంపారు.
Read also: Gautami Naik: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త బలం..
అంధత్వాన్ని జయించి క్రికెట్ శిఖరాలకు దీపిక ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.
దీపికకు ఒక కన్ను చూపు కోల్పోయిన మనోధైర్యంతో క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తన అద్భుత ప్రతిభతో భారత మహిళా అంధుల జట్టుకు కెప్టెన్ గా ఎదిగారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరపున ఆడుతూ అనేక విజయాలను అందించారు. క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలే నేడు ఆమెను దేశ రాజధానిలో జరిగే అత్యున్నత వేడుకలకు అతిథిగా నిలబెట్టాయి.
దీపిక రాష్ట్రపతికి కృతజ్ఞతలు
రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై దీపిక తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ అపురూప గౌరవానికి గాను దీపిక రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: