భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా స్పందించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం సోషల్ మీడియా (Social media) వేదికగా ఓ స్ఫూర్తిదాయక పోస్ట్ చేస్తూ, తాను క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడించారు. అదే సమయంలో, తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సహచరులు, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Ben Austin: మెడకు బంతి తగిలి యువ క్రికెటర్ మృతి

“ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ప్రతి రోజూ నా ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఈ కఠిన సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతు నాకు అపారమైన శక్తినిచ్చాయి. నన్ను మీ ప్రార్థనల్లో గుర్తుంచుకున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: