టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తన అద్భుత ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఆయన భార్య రివాబా జడేజా (Rivaba Jadeja) రాజకీయ రంగంలో సత్తా చాటుతూ గుజరాత్ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు.
అక్టోబర్ 17న గాంధీనగర్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రివాబా జడేజా గుజరాత్ మంత్రిగా ప్రమాణం చేశారు. జామ్‌నగర్ (Jamnagar) ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఇప్పుడు అధికారికంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Read Also: ODI series: వన్డే సిరీస్.. గాయం కారణంగా ఆల్‌రౌండర్ కేమరూన్ ఔట్

రివాబా జడేజా ఒక మెకానికల్ ఇంజనీర్ (Mechanical Engineer). విద్యావంతురాలు, సామాజిక సేవకురాలిగా ఆమె ఇప్పటికే ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. మహిళా సాధికారత కోసం రివాబా జడేజా (Rivaba Jadeja) ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
మహిళల భద్రత, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ఆమె చురుకుగా పనిచేశారు. అదే క్రమంలో 2019లో ఆమె అధికార బీజేపీ (BJP) లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పార్టీ పట్ల విశ్వాసం, ప్రజలతో ఉన్న అనుబంధం ఆమెను గెలిపించింది.
ధనిక ఎమ్మెల్యేలలో ఒకరిగా నిలిచింది
రవీంద్ర జడేజా భార్య రివాబా గుజరాత్ (Gujarat) లోని అత్యంత ధనిక ఎమ్మెల్యేలలో ఒకరిగా నిలిచింది. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లు (సుమారు $1 బిలియన్) ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. అందులో ఆమె భర్త రవీంద్ర జడేజా ఆస్తులు కూడా ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: