IPL 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో మార్పులు జరిగాయి. IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్‌లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా.
Read Also: IND vs SA: నేడే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది.
జైస్వాల్ లేదా రియాన్ పరాగ్‌తో పోలిస్తే, జురేల్‌కు నాయకత్వ అనుభవం కొద్దిగా ఉంది. అతను గతంలో 2020 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది అతన్ని ఇండియా ‘A’ వైస్-కెప్టెన్‌గా, సెంట్రల్ జోన్‌కు కెప్టెన్‌గా కూడా నియమించారు.
ఓపెనర్‌గా దూసుకుపోతున్న యశస్వి జైస్వాల్
గత సీజన్‌లో సంజూ శాంసన్ గాయపడినప్పుడు పరాగ్ ఎనిమిది మ్యాచ్‌లకు నాయకత్వం వహించినా, కేవలం రెండు మ్యాచ్‌లలోనే విజయం సాధించగలిగాడు. భారత ఓపెనర్‌గా దూసుకుపోతున్న యశస్వి జైస్వాల్ పేరు కూడా కెప్టెన్సీ చర్చలో ఉంది.
జైస్వాల్ ఒక స్పెషలిస్ట్ ఓపెనర్ కాబట్టి, ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమం కారణంగా కొన్నిసార్లు బౌలర్ కోసం అతన్ని సబ్‌స్టిట్యూట్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. అందుకే కెప్టెన్సీ రేసులో అతను జురేల్ కంటే కాస్త వెనుకబడ్డాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: