IPL 2025 : ఐపిఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఈ నెల 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఓటమి వెనుక మ్యాచ్ఫిక్సింగ్ ఉందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సిఎ) తాత్కాలిక కన్వీనర్ జైదీప్ బిహాని సంచలన ఆరోపణలు చేశారు. విజయానికి అనుకూలమైన స్థితిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఎలా ఓడిపోయిందో విచారించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.జైదీప్ బిహాని, ఆర్సిఎకు రాజస్థాన్ రాయల్స్ మేనేజిమెంట్ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐపిఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ నుంచి వచ్చిన అధికారిక లేఖను ఆర్సిఎ అందుకున్నప్పటికీ, సవాయి మాన్సింగ్ స్టేడియంతో ఎటువంటి ఎంఓయూ (MOU) లేదని రాజస్థాన్ రాయల్స్ తరఫున చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అయితే, ఎంఓయూ లేకపోయినా ప్రతీ మ్యాచుకు జిల్లా పరిషత్‌కు అద్దె చెల్లిస్తుంటే, ఇదేంటిని ఆయన ప్రశ్నించారు.

రాజస్థాన్ రాయల్స్ పై ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత విచారణకు డిమాండ్లు
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రికెట్ సంఘంపై అడ్వాక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీని ఐదోసారి పొడిగించడం జరిగింది. ఆర్సిఎ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని క్రికెట్ మ్యాచ్‌లు సజావుగా సాగుతున్నాయని వెల్లడించిన జైదీప్, ఐపిఎల్ సమయానికి మాత్రం జిల్లా పరిషత్ జోక్యం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.ఈ ఆరోపణలు తీవ్రతరమైనవిగా మారాయి. ఐపిఎల్ వంటి అంతర్జాతీయ స్థాయి టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం సమగ్ర విచారణ అవసరమని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణలపై బీసీసీఐ, ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్పందించి విచారణ జరపాల్సిన అవసరం ఉందని క్రీడాప్రియులు డిమాండ్ చేస్తున్నారు.
Read more : KL Rahul: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్