టాలీవుడ్ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) హైదరాబాద్‌లో ఘనంగా, విజయవంతంగా ముగిసిన ‘ది గోట్ మెస్సీ టూర్ ఇండియా 2025’ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతటి భారీ అంతర్జాతీయ ఈవెంట్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా, ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత, నాయకత్వ పటిమ ఉన్నాయని కొనియాడారు.
Read Also: Premante Movie: ఓటీటీలోకి ‘ప్రేమంటే’ ఎప్పుడంటే?
సీఎం రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమైంది
ఈ విషయంపై నాగవంశీ (Naga Vamsi) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “మెస్సీ టూర్ ఆద్యంతం ఎంతో సజావుగా సాగింది. ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడం గర్వంగా ఉంది. ‘తెలంగాణ రైజింగ్’ అనే మాట ఈ రోజు నిజమైందనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
ఈ ఈవెంట్‌తో హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతటి ఘనత సాధించడం సీఎం రేవంత్ రెడ్డి అవిశ్రాంత కృషి వల్లే సాధ్యమైందని నాగవంశీ కితాబిచ్చారు. ఆయన నాయకత్వ పటిమ వల్లే హైదరాబాద్ ఇలాంటి గ్లోబల్ ఈవెంట్లను సునాయాసంగా నిర్వహించగలుగుతోందని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: