యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. వీర్ బాల్ దివాస్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అందుకున్నారు. చిన్న వయసులో కల్చర్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారం ఇస్తారు.
Read Also: Vaibhav Suryavanshi: వైభవ్ కు అరుదైన ఘనత
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) మాట్లాడుతూ.. పురస్కారాలు అందుకున్న చిన్నారులను అభినందించారు. “మీ విజయాలు దేశం మొత్తానికి స్ఫూర్తినిస్తాయి. మీ లాంటి ప్రతిభావంతుల వల్లే భారతదేశం ప్రపంచ వేదికపై వెలుగొందుతోంది” అని ఆమె అన్నారు. వైభవ్ (Vaibhav Suryavanshi) తో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 19 మంది చిన్నారులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో వైభవ్ చేసిన ప్రదర్శనతో రికార్డులు బద్దలయ్యాయి. కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, బిహార్‌ను భారీ స్కోర్ దిశగా నడిపించాడు. ఆ ఇన్నింగ్స్‌తో వైభవ్ దేశీయ క్రికెట్‌లో అత్యంత దూకుడు బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద రికార్డులు నెలకొల్పుతూ, భవిష్యత్ భారత క్రికెట్‌కు ఆశాజనకంగా మారాడు. సీనియర్ జట్టులోకి కూడా వైభవ్‌ను తీసుకోవాలనే వాదన కూడా వినిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: