భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ తరహా పిచ్‌లతో టెస్ట్ క్రికెట్‌ను చంపేస్తున్నారని మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. పిచ్ క్యూరేటర్‌పై కూడా విమర్శలు గుప్పించారు.
Read Also: IND vs SA 2nd Test: గాయం కారణంగా.. ఆసుపత్రిలో చేరిన హార్మర్?
అయితే టర్నింగ్ ట్రాక్ అడిగింది తామేనని, కానీ అందుకు తగ్గట్లుగా తమ బ్యాటర్లు రాణించలేకపోయారని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పష్టం చేశాడు.ఈ క్రమంలోనే గౌహతి వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్‌కు ఎలాంటి పిచ్ తయారు చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

తొలి రోజు కాస్త టర్న్
అయితే ఈ పిచ్ గురించి గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ కీలకం కాదని, ఆటగాళ్ల నైపుణ్యం ముఖ్యమని చెప్పుకొచ్చాడు. పిచ్ ఇరు జట్లకు ఒకేలా ఉంటుందని గుర్తు చేశాడు. ‘గౌహతిలో తొలి రోజు కాస్త టర్న్ లభిస్తోంది. కాబట్టి టాస్ అంత ముఖ్యం కాదు. మేం మరీ స్పిన్ పిచ్‌ల కోసం చూడటం లేదు.
టీమిండియా తొలి టెస్ట్‌లో గెలిచి ఉంటే.. అసలు పిచ్‌ల గురించి చర్చే జరిగేది కాదు. పిచ్ విషయం కాకుండా ఆటగాళ్ల నైపుణ్యం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పిచ్ ఇరు జట్లకు ఒకేలా ఉంటుంది. కాబట్టి గౌహతిలో ఎలాంటి పిచ్ ఉన్నా అందుకు తగ్గట్లు రాణించగల సత్తా మా ఆటగాళ్లకు ఉంది.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: