ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల కల నిజమవుతోంది. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Messi) భారత పర్యటన అధికారికంగా ప్రారంభమైంది. ఈ తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్న మెస్సీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎన్నో ఏళ్లుగా ఆయనను ప్రత్యక్షంగా చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
Read Also: Lionel Messi: ఒకే వేదికపై మెస్సీ, షారుఖ్ ఖాన్

60 మంది రిజిస్టర్ చేసుకున్నారు
కోల్‌కతాలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, మెస్సీ (Messi) ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. ఇక్కడ మ్యాచ్ అనంతరం ఫొటో సెషన్ ఉండనుంది. ఆయనతో ఫొటో దిగేందుకు రూ.10లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు HYD గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్‌లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27 వేల టికెట్లు బుక్ అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: