భారత క్రికెట్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ను తీర్చిదిద్దడంలో ఆయన తండ్రి యోగరాజ్ సింగ్ (Yograj Singh) కీలక పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్ చిన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి, ప్రతిభను గుర్తించిన తండ్రి, అతనికి కఠిన శిక్షణ, మానసిక మద్దతు అందించడంలో సపోర్ట్ చేసారు.
Rohit Sharma: సెక్యూరిటీపై రోహిత్ శర్మ ఫైర్.. కారణమిదే?
అయితే, ఇటీవల యోగరాజ్ సింగ్ (Yograj Singh) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కుమారుడు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదగాలని కోరిక, వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపిందని వెల్లడించారు.
ఈ క్రమంలో తాను తన మొదటి భార్య షబ్నమ్ (Shabnam) పై కఠినమైన నియమాలను విధించానని.. దాని కారణంగా తన కుటుంబం తన నుంచి దూరం అయిందని.. ప్రజలు తనను పిచ్చివాడని కూడా పిలిచారని ఆయన వెల్లడించారు. .తాను తన భార్యపై కఠినమైన నిబంధనలు అమలు చేశానని యోగరాజ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ కఠిన వైఖరి తనను కుటుంబం నుంచి దూరం
తన ఈ కఠిన వైఖరి తనను కుటుంబం నుంచి దూరం చేసిందని.. తన వ్యక్తిగత సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన అంగీకరించారు.యువరాజ్ ఆరోగ్యం గురించి తన భార్య అంతగా ఆందోళన చెందితే.. ఆమె తనను వదిలి వెళ్లిపోవచ్చని కూడా తాను అన్నట్లు యోగరాజ్ సింగ్ చెప్పారు.

యువరాజ్ సింగ్ గురించి తన తల్లి కూడా ఆందోళన చెందేవారని.. తాను చనిపోయే ముందు బిడ్డను వదిలిపెట్టమని వేడుకున్నారని యోగరాజ్ సింగ్ వివరించారు.తన కఠిన ప్రవర్తనను సమర్థించుకుంటూ..
గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాలనే తన కోరిక
తాను విదేశీ పాఠశాలలో చదువుకున్నానని, అక్కడ తనకు క్రమశిక్షణ నేర్పారని.. అదే క్రమశిక్షణను ఇతరులపై కూడా రుద్దామని యోగరాజ్ సింగ్ (Yograj Singh) అన్నారు.ఇది తన భార్యతోనే మొదలైందని చెప్పారు. “నా అనుమతి లేకుండా నా భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదు.
వారి కుటుంబ సభ్యులను నా ఇంట్లోకి అనుమతించేవాడిని కాదు, ఒకవేళ వచ్చినా, నాకు సలహాలు ఇవ్వడానికి అనుమతి ఉండేది కాదు” అని యోగరాజ్ సింగ్ వివరించారు.యువరాజ్ సింగ్‌ను గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాలనే తన కోరిక గురించి మాట్లాడుతూ.. “మాకు కొడుకు పుట్టినప్పుడు, నేను నా తల్లితో చెప్పాను, వాడిని గొప్ప ఆటగాడిగా తయారు చేయాలనే నిప్పు నాలో ఉంది.
నా పట్ల అన్యాయం చేసిన వారందరిపై
నా పట్ల అన్యాయం చేసిన వారందరిపై కపిల్ దేవ్‌తో సహా, నా కొడుకు ద్వారా ప్రతీకారం తీర్చుకుంటానని నేను ప్రమాణం చేశాను” అని యోగరాజ్ సింగ్ (Yograj Singh) చెప్పారు. తన క్రికెట్ కెరీర్ గురించి అడిగినప్పుడు, తన కెరీర్ వైఫల్యం కారణంగా ముగియలేదని, తన పట్ల జరిగిన అన్యాయం కారణంగానే ముగిసిందని ఆయన అన్నారు.
“నా పద్ధతి మాత్రమే సరైన పద్ధతి. నేను రాత్రి అంటే రాత్రే; నేను పగలు అంటే పగలే” అని ఆయన అన్నారు. తన కుటుంబం ఈ వైఖరిని బలహీనతగా భావించిందని, అయితే ఇది తనకు అంచును ఇచ్చిందని ఆయన నమ్ముతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: