హెడింగ్లే (Headingley Test) మైదానంలో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను తేలికగా ఎదుర్కొంటూ ఒకదాని వెంట ఒక సెంచరీతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ హుందాగా వంద బాదితే, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) అద్భుతంగా సెంచరీ పూర్తిచేశాడు.ఇది పంత్‌కు ఒకే టెస్టులో రెండు సెంచరీలు సాధించిన తొలి అవకాశం. ఇంగ్లండ్‌పై ఇదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో వందలు కొట్టిన ఏడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టుల్లో ఈ ఫీట్ సాధించటం పంత్‌కి గొప్ప మైలురాయి.
గేర్ మార్చిన పంత్ – టంగ్‌పై ఫోర్ల వర్షం
భోజన విరామం తర్వాత పంత్ తన ఆటను వేగవంతం చేశాడు. పేసర్ జోష్ టంగ్ వేసిన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత మరో బౌండరీతో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఆడిన పంత్, ఇంగ్లండ్ బౌలర్లకు సమాధానం ఇచ్చాడు.
బషీర్‌పై సిక్సర్ – సెంచరీ బరిలోకి దూసుకెళ్లిన పంత్
ఆఫ్ స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన పంత్, తర్వాత సింగిల్స్‌తో స్కోరు పెంచుకుంటూ వచ్చాడు. జో రూట్ ఓవర్లో ఒక పరుగు తీసి 99కి చేరుకున్నాడు. తర్వాత బషీర్ బౌలింగ్‌లో మరో సింగిల్‌తో శతకం సాధించాడు.
టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు
ఇప్పటివరకు ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు ఏడు మంది మాత్రమే. సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ మూడుసార్లు సాధించాడు. రాహుల్ ద్రవిడ్ రెండుసార్లు, విజయ్ హజారే, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మ ఒక్కసారి చొప్పున చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో పంత్ చేరిపోయాడు.
Read Also : Rishabh Pant: అంపైర్ తో గొడవ..రిషబ్ పంత్‌పై నిషేధం విధిస్తారా?