ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ (ICC ODI Rankings) లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 845 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో మిచెల్ అద్భుతంగా రాణించి 352 పరుగులు చేశాడు.
Read Also: Mitchell Santner: టీ20 సిరీస్ ను కూడా గెలుస్తాం: న్యూజిలాండ్ కెప్టెన్
కొన్ని రోజుల వ్యవధిలోనే రెండో స్థానానికి
ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ లో, విరాట్ కోహ్లి 80.00 యావరేజ్తో 240 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ (124), ఒక హాఫ్ సెంచరీ (93) ఉన్నాయి. రాజ్ కోట వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో కోహ్లి (24) బ్యాటింగ్ లో విఫలమయ్యాడు.

మొత్తం మీద దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత నం.1 ర్యాంక్ ను సొంతం చేసుకున్న విరాట్ కొన్ని రోజుల వ్యవధిలోనే రెండో స్థానానికి పడిపోయాడు. రోహిత్ శర్మ నాలుగో స్థానంలో, శుభ్ మన్ గిల్ ఐదో స్థానంలో, కేఎల్ రాహుల్ పదో స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ పదకొండో స్థానంలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: