ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటిచెప్పిన టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ (Novak Djokovic), ఫైనల్‌కు దూసుకెళ్లి విమర్శకుల నోళ్లు మూయించారు. వయసు, ఫామ్, ఫిట్‌నెస్ అంటూ తనపై వచ్చిన అనేక అనుమానాలకు టెన్నిస్, కోర్టులో ఆటతోనే సమాధానం చెప్పారు. ఈ క్రమంలో తనను తక్కువగా అంచనా వేసిన వారిపై సెటైర్లతో కూడిన వ్యాఖ్యలు చేసి, మరోసారి వార్తల్లో నిలిచారు.
Read Also: Saina Nehwal: పరిణీతి చోప్రా అన్‌ఫాలోపై సైనా రియాక్షన్ ఇదే!

వారందరికీ ధన్యవాదాలు
‘చాలామందికి నాపై నమ్మకం లేదు. కొందరు ఎక్స్‌పర్ట్స్ రిటైర్ అవ్వాలని సలహాలు కూడా ఇచ్చారు. ఆ మాటలు తప్పని నిరూపించేలా నన్ను మోటివేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు’ అని ఎద్దేవా చేశారు. 25 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు 38 ఏళ్ల నొవాక్ (Novak Djokovic) అడుగు దూరంలో ఉన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: