ఇంగ్లండ్ (England)తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్‌కు శుభం కంటే దుర్వార్తే ఎక్కువగా ఎదురవుతోంది. తాజాగా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ అతడికి మోకాలికి గాయం అయిందని సమాచారం. స్కాన్ చేసిన అనంతరం అతడి లిగమెంట్ దెబ్బతిన్నట్టు తేలింది. ESPN క్రిక్‌ఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం, ఈ గాయంతో మిగిలిన రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని తేలింది.టీమిండియా ఆటగాళ్లతో పాటు నితీశ్ కుమార్ కూడా మాంచెస్టర్‌కు వెళ్లినప్పటికీ, ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మాత్రం పాల్గొలేకపోయాడు. దీంతో అతని గాయం తీవ్రంగా ఉండొచ్చని అర్థమవుతోంది.

ఆకాశ్ దీప్ కూడా గాయం బారినే!
నితీశ్ ఒక్కరే కాదు, రెండో టెస్టులో ఆకట్టుకున్న పేసర్ ఆకాశ్ దీప్ కూడా గాయంతో బాధపడుతున్నాడని వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు బీసీసీఐ ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.నితీశ్ గాయం వల్ల శార్దూల్ ఠాకూర్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి టెస్టులో శార్దూల్ అంతగా ప్రభావితం చేయలేకపోవడంతోనే అతని స్థానంలో నితీశ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శార్దూల్‌కు మళ్లీ అవకాశం దక్కేలా ఉంది.
అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో అన్షుల్
ఇంకా మరో కీలక బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా చేతికి గాయం కారణంగా సిరీస్‌కు గుడ్‌బై చెప్పాడు. అతని స్థానంలో అన్షుల్ కాంబోజ్ భారత జట్టులోకి ఎంపికయ్యాడు.ఇప్పటికే భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. సిరీస్‌లో నిలబడాలంటే జూలై 23న మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్ట్‌ను గెలవడం తప్పనిసరి. కానీ కీలక ఆటగాళ్ల గాయాలతో జట్టు ముందు పెద్ద సవాల్ నిలిచింది. ఇది టీమిండియాకు నిజమైన పరీక్షగా మారింది.
Read Also : Hero Ajith : అజిత్‌కి తప్పిన పెద్ద ప్రమాదం..