New Zealand vs UAE : టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు దూకుడు కొనసాగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో యూఏఈపై కివీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు.
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, కేవలం 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫెర్ట్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలవగా, ఫిన్ అలెన్ 50 బంతుల్లో 84 పరుగులతో చెలరేగాడు. తొలి ఓవర్ నుంచే యూఏఈ బౌలర్లపై దాడి చేసిన ఈ జోడీ పవర్‌ప్లేలోనే 78 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చింది. వీరిద్దరూ కలిసి అజేయంగా 175 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ప్రపంచకప్ చరిత్రలో రికార్డు సృష్టించారు.
Read Also: Ranji Trophy 2026 : 299 వద్ద ఔట్, ట్రిపుల్ సెంచరీ మిస్! రంజీలో అరుదైన ఘటన

అంతకుముందు టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ మహమ్మద్ వసీం (66 నాటౌట్), అలిషాన్ షరాఫు (55) అర్ధశతకాలతో రాణించారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ రెండు వికెట్లు తీయగా, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ సాధించాడు.
ఈ విజయంతో గ్రూప్-సిలో న్యూజిలాండ్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, యూఏఈ మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: