అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి (Messi) భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో మెస్సి, ల్యాండ్ అయ్యారు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు అర్ధరాత్రి వేళ కూడా వందలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తారు. వీరిలో ఓ కొత్త పెళ్లికూతురు ప్రదర్శించిన ప్లకార్డ్ అందరి దృష్టిని ఆకర్షించి, సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read Also: Messi: మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత

నా భర్తతో మాట్లాడి హనీమూన్‌ను వాయిదా వేసుకున్నా
“గత శుక్రవారమే నాకు పెళ్లయింది. కానీ, మెస్సీని చూడటం కోసం మా హనీమూన్‌ను రద్దు చేసుకున్నాం” అని రాసి ఉన్న ప్లకార్డ్‌ను ఆమె పట్టుకుంది. ఆమె మాట్లాడుతూ.. “నేను 2010 నుంచి మెస్సీ (Messi) కి వీరాభిమానిని. ఆయన మా నగరానికి వస్తున్నారని తెలిసి, నా భర్తతో మాట్లాడి హనీమూన్‌ను వాయిదా వేసుకున్నాను. 2011లో ఆయన వచ్చినప్పుడు చూసే అవకాశం రాలేదు. అప్పుడు మేము చిన్నవాళ్లం. ఈసారి ఆ ఛాన్స్ వదులుకోలేం” అని ఆమె పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: