అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైందని చెప్పడానికి ఈ ఫలితం సరిపోతుంది. చిన్న దేశంగా, పసికూన జట్టుగా భావించే నేపాల్ (Nepal), ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను గర్వంగా శాసించిన రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ విజేత వెస్టిండీస్ జట్టుకు పెద్ద షాక్ ఇచ్చింది. శనివారం షార్జాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ (T20 match) లో 19 పరుగుల తేడాతో నేపాల్ చారిత్రక విజయం సాధించింది. ఈ విజయం నేపాల్ క్రికెట్ చరిత్రలో లిఖించబడింది.
Sheetal Devi: శీతల్ దేవికి గోల్డ్ మెడల్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) (ICC) పూర్తిస్థాయి సభ్యదేశంపై టీ20 ఫార్మాట్‌లో నేపాల్‌కు ఇదే మొట్టమొదటి గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేపాల్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ (West Indies) బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ జట్టు ఆదిలోనే కుశాల్ భుర్తెల్ (5), ఆసిఫ్ షేక్ (3) వికెట్లను త్వరగా కోల్పోయింది.

ఆ దశలో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35 బంతుల్లో 38), కుశాల్ మల్లా (21 బంతుల్లో 30), గుల్సన్ ఝా (16 బంతుల్లో 22) కీలక ఇన్నింగ్స్ (innings) లు ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, నవీన్ బిదైసీ 3 వికెట్లు తీశాడు.అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్, నేపాల్ బౌలర్ల ధాటికి తడబడింది.
ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోయారు
ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొనితెచ్చుకుంది. ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోయారు. నవీన్ బిదైసీ (Naveen Bidaisi) (22), అమీర్ జంగూ (19) మాత్రమే కాస్త ఫరవాలేదనిపించారు.
చివర్లో ఫాబియన్ అలెన్ (19), కెప్టెన్ అకీల్ హొసేన్ (18) కాస్త పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తెల్ రెండు వికెట్లతో రాణించాడు. రెండో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 29న జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: