మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s ODI World Cup 2025)లో భారత్ – సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఒక వివాదం చెలరేగింది. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్లలో జరిగిన సంఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ (Richa Ghosh) ప్రవర్తనపై సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినే డీ క్లెర్క్ (Nadyne de Klerk) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Clutch Chess 2025: విశ్వనాథన్ ఆనంద్‌పై గ్యారీ కాస్పరోవ్ విజయం
గురువారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో సౌతాఫ్రికా మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో కీలక స్థానాన్ని దక్కించుకుంది. అయితే మ్యాచ్ చివరి దశల్లో భారత జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ గాయం నటన చేసి మ్యాచ్ మూమెంటమ్‌ను దెబ్బతీసిందని నదినే డీ క్లెర్క్ ఆరోపించింది.
“రిచా ఘోష్ గాయపడినట్లు నటించి ఆటను కొంతసేపు నిలిపివేయించింది. మేము మంచి రన్ ఫ్లోలో ఉన్నాం, కానీ ఆ సమయంలో ఆ విరామం వల్ల మా బ్యాటింగ్ రిథమ్ కొద్దిగా ఆగిపోయింది. అయినా సరే, అది మాకు బెనిఫిట్ అయింది. మేము కూల్‌గా ఆడి మ్యాచ్ గెలిచాం” అని డీ క్లెర్క్ (Nadyne de Klerk) మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.క్రాంతి గౌడ్ వేసిన 47వ ఓవర్‌లో నదినే డీక్లెర్క్ తొలి మూడు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పుకుంది.

రిచా ఘోష్ గాయంతో ఇబ్బంది పడుతూ కనిపించింది
ఆ సమయంలోనే రిచా ఘోష్ గాయంతో ఇబ్బంది పడుతూ కనిపించింది. మైదానంలోకి వచ్చిన ఫిజియోలు ఆమె చికిత్స చేశారు. దాంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఫిజియోల చికిత్సతో కోలుకున్న రిచా ఘోష్ ఎలాంటి అసౌకర్యం లేకుండా వికెట్ కీపింగ్ చేసింది. దాంతో రిచా ఘోష్ గాయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా ఇలానే గాయం డ్రామా ఆడి సౌతాఫ్రికా మూమెంటమ్‌ను దెబ్బతీసాడు. రిచా ఘోష్ కూడా అదే చేయబోయిందా? అనే మాటలు వినిపించాయి. కానీ ఈ ప్లాన్ టీమిండియాకు వర్కౌట్ కాలేదు. తన జోరును కొనసాగించిన డి క్లెర్క్.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.
డ్రామాలా అనిపించింది
‘రిచా ఘోష్‌ది గాయం కాదు. డ్రామాలా అనిపించింది. ఆమె గాయం గురించి మేం ప్రశ్నించాం. మా మూమెంటమ్‌ను దెబ్బతీయడానికి ఆమె పన్నిన వ్యూహం ఇది. ఇది డ్రామా అని మేం గ్రహించాం. అయితే ఈ సమయం మాకు కలిసొచ్చింది. కాస్త విశ్రాంతి తీసుకొని మా ఆట ప్రణాళికలను సమీక్షించుకున్నాం.’అని నదినే డీక్లెర్క్ చెప్పుకొచ్చింది.ప్రత్యర్థి జట్ల మూమెంటమ్‌ను బ్రేక్ చేయడానికి మైదానంలో ఆటగాళ్లు గాయం డ్రామా ట్రిక్కును వాడుతున్నారు.
అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే చర్చ జరుగుతుంది. ఇలాంటి పనులు చేయకుండా ఐసీసీ (ICC) కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. తాజాగా రిచా ఘోష్ వ్యవహారంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: