Mohammad amir : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ భారత జట్టు అవకాశాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రూప్ దశలో భారత్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ, సూపర్-8లో అదే స్థాయి ప్రదర్శన కొనసాగించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్ దాకా భారత్ చేరడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించాడు.
భారత్ బ్యాటింగ్‌పై మాట్లాడిన ఆమిర్, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే భారత బ్యాటర్లు పూర్తి స్థాయిలో రాణించారని, ఇతర మ్యాచ్‌లలో ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే మెరుగైన ప్రదర్శన చేశారని పేర్కొన్నాడు. చిన్న జట్లపై గెలుపులను ఎక్కువగా అంచనా వేయకూడదని కూడా సూచించాడు.
Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?

సూపర్-8 దశలో పోటీ మరింత కఠినంగా ఉంటుందని, జింబాబ్వే వంటి జట్లు కూడా ప్రమాదకరంగా మారవచ్చని ఆమిర్ హెచ్చరించాడు. దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు ఉన్నాయని, భారత్ మాత్రం అక్కడికే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడగా, భారత్ తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో పోటీ పడనుంది. అనంతరం జింబాబ్వే, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: