हिन्दी | Epaper
తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20

Latest News: Michelle Marsh: ఓటమి పై ఆసీస్ కెప్టెన్ ఏమన్నారంటే?

Aanusha
Latest News: Michelle Marsh: ఓటమి పై ఆసీస్ కెప్టెన్ ఏమన్నారంటే?

టీమిండియా చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ (Michelle Marsh) స్పందించాడు. నాలుగో టీ20లో భారత్‌ బౌలర్ల ధాటికి తన జట్టు 48 పరుగుల తేడాతో పరాజయం పాలవడంతో నిరాశ వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి ఎదురవడం పట్ల బాధ వ్యక్తం చేస్తూ, కీలక సమయాల్లో భాగస్వామ్యాలు లేకపోవడం తమ పరాజయానికి ప్రధాన కారణమని వివరించాడు.

Read Also: IND vs AUS: నాలుగో టీ20లో టీమ్‌ఇండియా ఘనవిజయం

ఒకటి, రెండు భాగస్వామ్యాలు నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన నాలుగో టీ20 (T20) లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ మార్ష్.. 167 పరుగుల లక్ష్యం ఛేదించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

‘బ్యాటింగ్‌కు దిగేటప్పుడు 167 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదిస్తామని అనుకున్నా(Michelle Marsh) . కానీ పిచ్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు. సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఇది ఛేదించాల్సిన లక్ష్యమే. ఇలాంటి కండిషన్స్‌లో ఒకటి, రెండు భాగస్వామ్యాలు అవసరం. కానీ మేం వాటిని నమోదు చేయలేకపోయాం. భారత్ మాత్రం అద్భుతంగా ఆడింది.

జట్టుతో ఆడాలని ఎవరైనా అనుకుంటారు

ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో వారికి తిరుగు లేదు. వారిది వరల్డ్ క్లాస్ టీమ్. ఏ మ్యాచ్‌లోనైనా పూర్తి శక్తివంతమైన జట్టుతో ఆడాలని ఎవరైనా అనుకుంటారు. కానీ మా ఆటగాళ్లకు ఒక పెద్ద సిరీస్(యాషెస్) ఉంది. దాంతో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాం.

Michelle Marsh
Michelle Marsh

ఇలాంటి హై ఇంటెన్స్ ఉన్న మ్యాచ్‌ల్లో అవకాశం ఇస్తే వారికి ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయం.’అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్

శుభ్‌మన్ గిల్(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23), సూర్యకుమార్ యాదవ్(10 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టోయినిస్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.

మిచెల్ మార్ష్(24 బంతుల్లో 4 ఫోర్లతో 30), మాథ్యూ షార్ట్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(3/3) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 శనివారం బ్రిస్బేన్ వేదికగా జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870