కోల్‌కతాలో లియోనల్ మెస్సీ (Messi) పర్యటన సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ (Messi) ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తుతో పాటు, 450 సీసీ కెమెరాలు, డ్రోన్‌లను రంగంలోకి దించారు. టికెట్లు/పాస్‌లు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు.
Read Also: Auction players list : IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ? జాబితా బయట!”

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: