భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ విజేతను నిర్ణయించే చివరి కీలక మ్యాచ్ విశాఖపట్నంలో, జరగనుంది. విశాఖపట్నంలో జరగనున్న మూడో వన్డేపై మొదట్లో ఎవరు, పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ,నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్ని, సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ అసాధారణమైన డిమాండ్‌కు కారణం విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల రాంచీ, రాయ్‌పూర్‌లో ఆడిన వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు కొట్టడమే.
Read Also: IND vs SA 3rd ODI: రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్
ఈ స్థాయిలో స్పందన రావడం చాలా అరుదు
ఆయన ఫామ్ చూసి వైజాగ్‌లో కూడా మరో సెంచరీ చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఈ మ్యాచ్ టికెట్లకు ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ స్థాయిలో స్పందన రావడం చాలా అరుదని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చెబుతోంది. నవంబర్ 28న ఈ మ్యాచ్ కోసం ఆన్‌లైన్‌లో తొలి దశ టికెట్ల అమ్మకాలు ప్రారంభమైనప్పుడు స్పందన చాలా తక్కువగా వుంది.

దీంతో ఏసీఏ అధికారులు ఆఫ్‌లైన్‌లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, రాంచీ, రాయ్‌పూర్‌లలో కోహ్లీ శతకాలు బాదడంతో పరిస్థితి మారిపోయింది. “కోహ్లీ (Virat Kohli) రాంచీ సెంచరీ తర్వాత, రెండో, మూడో దశ టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. ఒక్క టికెట్ కూడా మిగల్లేదు” అని ఏసీఏ మీడియా ప్రతినిధి వై. వెంకటేశ్ తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: