మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజానె కాప్ (Marizanne Kapp) అసాధారణ ఘనత సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది.
ఈ విజయంతో ఆమె భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) ను అధిగమించింది. కాప్ ఖాతాలో ఇప్పుడు 44 వికెట్లు నమోదయ్యాయి, కాగా జులన్ గోస్వామి 43 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
Read Also: KL Rahul: పీటర్సన్‌పై అతడి భార్యకు ఫిర్యాదు చేశానన్న రాహుల్

వీరిద్దరి తర్వాతి స్థానాల్లో లిన్ ఫుల్‌స్టన్(39), మేఘన్ షుట్(39), కరోల్ హోడ్జెస్(37), సోఫీ ఎక్లెస్టోన్(37) ఉన్నారు. కాగా నిన్న SFలో మారిజానె కాప్ (Marijane Kapp) బ్యాటింగ్‌లోనూ విలువైన 42 రన్స్ చేశారు.
మారిజానె కాప్ తన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. నిన్న జరిగిన ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌లో ఆమె 42 విలువైన పరుగులు చేసి జట్టును స్థిరపరిచింది. బౌలింగ్‌లో మాత్రం ఆమె మ్యాజిక్ చూపించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: