సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో గంభీర్ (Gautam Gambhir) పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతని అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియా ఘోర పరాజయాలను మూటగట్టుకుంటుందని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడుతున్నారు. తక్షణమే హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Rishabh Pant: క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన పంత్
ఈ నేపథ్యంలో, గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ (Manoj Tiwary) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఈ ఓటమి తనను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదని, గంభీర్ అనుసరిస్తున్న తప్పుడు వ్యూహాల వల్లే ఇది జరిగిందని తివారీ ఆరోపించాడు. “ఈ ఫలితం ముందే ఊహించిందే. జట్టులో అనుసరిస్తున్న ప్రక్రియ, ప్రణాళికలు సరైనవి కావు.
జట్టులో పదేపదే మార్పులు చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ధోరణి గత కొన్ని సిరీస్‌ల నుంచి కొనసాగుతోంది” అని ఆయన ఓ జాతీయ మీడియాతో అన్నారు.”భారత టెస్ట్ క్రికెట్‌ను కాపాడాలంటే బీసీసీఐ (BCCI) వెంటనే ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలి. టెస్టులకు ప్రత్యేక కోచ్‌ను నియమించడానికి ఇదే సరైన సమయం.

అనుభవం లేని వైట్-బాల్ హెడ్ కోచ్
ఇందులో ఎలాంటి సందేహం లేదు” అని తివారీ (Manoj Tiwary) పేర్కొన్నాడు.ఇటీవల గంభీర్ తన హయాంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచామని, ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ డ్రా చేసుకున్నామని చెప్పడాన్ని తివారీ తప్పుబట్టాడు. “గంభీర్ చెబుతున్న వన్డే జట్టును రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ కలిసి నిర్మించారు.
గంభీర్ కోచ్‌గా లేకపోయినా భారత్ ఆ టోర్నీలు గెలిచేది. ఇక, ఇంగ్లండ్ సిరీస్ డ్రా కావడం గొప్పేమీ కాదు. ఆఖరి రోజు ఇంగ్లండ్ ఆటగాళ్లు అనవసర షాట్లు ఆడటంతోనే సిరీస్ 3-1తో కోల్పోకుండా బయటపడ్డాం” అని తివారీ విమర్శించాడు. కిందిస్థాయిలో అనుభవం లేని ఒక వైట్-బాల్ మెంటర్‌ను హెడ్ కోచ్‌గా చూడటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: