Bharat మహిళల ట్రై సిరీస్ ఫైనల్‌కు భారత్: దక్షిణాఫ్రికాపై 23 పరుగుల తేడాతో గెలుపు
వన్డే ట్రై సిరీస్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ సిరీస్‌లో మూడవ విజయాన్ని అందుకొని ఫైనల్ ‘బెర్త్’ను కన్ఫర్మ్ చేసింది. శ్రీలంక వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా మహిళలతో హోరాహోరీగా పోటీ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్, జెమీమా రోడ్రిగ్స్ (101 బంతుల్లో 123 పరుగులు, 15 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు సెంచరీ సాధించడంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో అలవోకగా గెలిచింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 314 పరుగులకు పరిమితమైంది.338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లారా గూడాల్‌ను 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అమన్ జ్యోత్ కౌర్ ఔట్ చేసింది. ఈ దశలో బ్రిట్స్, స్మిత్ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అప్పుడు భారత్ విజయం ఖాయమన్న సమయంలో, సఫారీ కెప్టెన్ చార్లీ ట్రయాన్ మెరువులు మెరిపించి కౌర్ సేనను భయపెట్టింది. 43 బంతుల్లోనే 67 పరుగులు చేసి మ్యాచ్ చివరికి పోరాడి, 23 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.

భారత్ మహిళల జట్టు 23 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌లో అడుగు పెట్టింది
మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 337 పరుగుల భారీ స్కోర్ చేశారని చెప్పాలి. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా, స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. స్మృతి హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ (93) సౌతాఫ్రికా బౌలర్లను దంచి కొట్టారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది. ఐదో వికెట్‌కు 122 పరుగులు జోడించి, జట్టు స్కోర్‌ను 337 పరుగులకు చేర్చారు.ఈ విజయం ద్వారా భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరినందున, ట్రై సిరీస్‌లో వారి ప్రదర్శన శక్తివంతంగా కొనసాగుతోంది.
Read More : India Pakistan War: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ కొనసాగేనా?