ఫుట్‌బాల్ బిగ్ సర్‌ప్రైజ్! అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్, ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అపారమైన అభిమానులను సంపాదించిన లియోనల్ మెస్సీ (Lionel Messi) త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈసారి ఆయన సందడి దక్షిణాదిలోనూ చూడబోతున్నాం. తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ నెలలో మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) కు రానున్నారు.
Read Also: Kane Williamson: T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్
తొలుత కేరళ (Kerala) లో పర్యటించాలని అనుకున్నప్పటికీ, ఆ వేదిక రద్దయింది. దీంతో మెస్సీ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.భారత్ పర్యటనలో భాగంగా కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో మెస్సీ సందడి చేయనున్నారు.
దక్షిణాదిలో లక్షలాది మంది ఫుట్‌బాల్ అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భారత్‌లో మెస్సీ (Lionel Messi) పర్యటన నిర్వాహకుడు సతాద్రు దత్తా వెల్లడించారు. వారం రోజుల్లో బుకింగ్‌లు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు.

వేదిక గచ్చిబౌలి లేదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
వేదిక విషయానికి వస్తే గచ్చిబౌలి లేదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 12-13 అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున మెస్సీ కోల్‌కతా (Kolkata) కు చేరుకుంటారు. సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. డిసెంబర్ 14న ముంబై, డిసెంబర్ 15న ఢిల్లీలో పర్యటిస్తారు. ఆ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తోనూ ఆయన భేటీ కానున్నారని నిర్వాహకులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: