ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక లెజెండ్‌గా నిలిచిన లియోనెల్ మెస్సీ (Lionel Messi), తన అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఆయన పేరు చెప్పగానే మైమరచిపోతారు. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెస్సీ మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నాడనే వార్త క్రీడాభిమానుల్లో హుషారుని నింపింది.
Siraj: లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయిన విండీస్..
ఈ పర్యటనలో భాగంగా ఆయన దేశంలోని పలు నగరాలను సందర్శించనున్నారు.అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ “గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025” (“Goat Tour of India 2025”) పేరుతో భారత్‌లో పర్యటించనున్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ టూర్‌లో భాగంగా మెస్సీ మొదట కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు.
త్వరలోనే నాలుగో నగరాన్ని కూడా ప్రకటిస్తామని ఈవెంట్ మేనేజర్ తెలిపారు. 2011లో అర్జెంటీనా జాతీయ జట్టుతో కలిసి కోల్‌కతా (Kolkata) లో వెనిజులాపై ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన తర్వాత మెస్సీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.ఈ పర్యటనపై మెస్సీ స్పందిస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. “భారత్ చాలా ప్రత్యేకమైన దేశం.

ఇప్పుడు కొత్త తరం అభిమానులను కలుసుకోవడానికి
14 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పటి మధుర జ్ఞాపకాలు నాకింకా గుర్తున్నాయి. అప్పటి అభిమానుల స్పందన అద్భుతం. ఇప్పుడు కొత్త తరం అభిమానులను కలుసుకోవడానికి, ఫుట్‌బాల్‌పై నాకున్న ఇష్టాన్ని వారితో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని మెస్సీ పేర్కొన్నారు.ఈ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియం,
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోల్‌కతాలో మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు, ఓ కొత్త స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు.
ఈ డిసెంబర్ పర్యటనకు ముందే
అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్య నేతలతో పాటు, స్థానిక క్రీడా, సినీ ప్రముఖులతో కూడా మెస్సీ సమావేశం కానున్నారు.ఈ డిసెంబర్ పర్యటనకు ముందే, నవంబర్‌లో అర్జెంటీనా ప్రపంచకప్ విజేత (Argentina World Cup winner) జట్టుతో కలిసి మెస్సీ కొచ్చిలో ఓ మ్యాచ్ ఆడనుండటం విశేషం. ఫిఫా అంతర్జాతీయ విండోలో భాగంగా అర్జెంటీనా జట్టు ఈ మ్యాచ్ ఆడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: