మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. మెగా వేలంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wollwardt) రికార్డ్ ధరను సొంతం చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో ఈ సౌతాఫ్రికా ప్లేయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది.
Read Also: WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఎప్పుడంటే?

రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన లారా వోల్వార్డ్ట్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు సొంతం చేసుకుంది.2023లో డబ్ల్యూపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన లారా వోల్వార్డ్ట్ (Laura Wollwardt గుజరాత్ టైటాన్స్ తరఫున ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి 125.74 స్ట్రైక్‌రేట్‌తో 342 పరుగులు చేసింది.
2023లో బెత్ మూనీ గాయపడటంతో జట్టులోకి వచ్చిన లారా వోల్వార్డ్ట్‌కు తుది జట్టులో ఎక్కువ అవకాశాలు దక్కలేదు. రూ. 30 లక్షల కనీస ధరతోనే ఆమె మూడు సీజన్ల పాటు ఆడింది. డబ్ల్యూపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: