టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఆటలో శైలి, శాంత స్వభావం, పెద్ద ఇన్నింగ్స్ ఆడే తీరు ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అయితే, రోహిత్ శర్మ కేవలం క్రికెట్‌కే పరిమితమైన వ్యక్తి కాదు. ఖాళీ సమయాల్లో సినిమాలు చూడడం, విశ్రాంతి తీసుకోవడం ఆయనకు ఎంతో ఇష్టం. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం ఆయన స్వయంగా వెల్లడించారు.సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ (Sports journalist Vimal Kumar) నిర్వహించిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన వ్యక్తిగత అభిరుచుల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే, తనకు టాలీవుడ్ సినిమాలు కూడా బాగా నచ్చుతాయని ఆయన తెలిపారు. అందులోనూ తెలుగు అగ్ర హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ నటించిన సినిమాలను చూసి ఆనందిస్తానని చెప్పారు.
అభిమానులను ఆనందపరిచే
తాను రెగ్యులర్‌గా ఎక్కువ సినిమాలు చూడలేనప్పటికీ, సమయం దొరికినప్పుడు తప్పకుండా చూడటానికి ఇష్టపడతానని రోహిత్ పేర్కొన్నారు.అల్లు అర్జున్, మహేశ్ బాబు వంటి నటులు తెలుగు సినీ రంగంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు. ప్రత్యేకంగా అల్లు అర్జున్ “పుష్ప” సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందగా, మహేశ్ బాబు (Mahesh Babu) తన క్లాస్ అండ్ మాస్ మిశ్రమ నటనతో కోట్లాది ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానుల జాబితాలో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు కూడా చేరడం టాలీవుడ్ అభిమానులను ఆనందపరిచే అంశంగా మారింది.తనకు యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కే చిత్రాలు, డాక్యుమెంటరీలు అంటే ఇష్టమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.రోహిత్ శర్మకు తెలుగు భాషతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతని అమ్మమ్మ ఊరు వైజాగ్.

అభిమాన నటులని
రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ వైజాగ్‌కు చెందినవారే. రోహిత్ మాతృ భాష తెలుగు అయినప్పటికీ అతను ఎక్కువగా మరాఠి, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతారు. తెలుగు భాష తెలిసినా స్పష్టంగా మాట్లాడలేడు. కానీ తెలుగు తనకు బాగా అర్థమవుతుందని రోహిత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.సౌత్ హీరోలను పెద్దగా అభిమానించకున్నా..బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ తన అభిమాన నటులని రోహిత్ శర్మ తెలిపాడు. హీరోయిన్లలో విద్యా బాలన్, దీపికా పడుకొనే అంటే ఇష్టమని, కరీనా కపూర్ (Kareena Kapoor) అంటే తనకు క్రష్ ఉందని కూడా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హైదరాబాద్‌తో రోహిత్ శర్మకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐపీఎల్ కెరీర్‌ను రోహిత్ శర్మ హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ ఛార్జర్స్‌తోనే ప్రారంభించాడు. అతను ఈ జట్టు తరఫున మూడేళ్లు ఆడాడు. అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్‌తో పాటు 2009, 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్‌లోనే కొనసాగాడు. ఐపీఎల్ 2019 టైటిల్ గెలవడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు.
లేకుంటే అతనే
ఐపీఎల్ 2011 మెగా వేలంలో అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. లేకుంటే అతనే డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యేవాడని ఆ జట్టు విన్నింగ్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ చాలా ఇంటర్వ్యూల్లో తెలిపాడు. మూడేళ్ల పాటు హైదరాబాద్‌కు ఆడిన రోహిత్ శర్మకు పాపులర్ తెలుగు హీరోల గురించి అవగాహన ఉంది. రోహిత్ శర్మ బయోపిక్‌కు టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, శర్వానంద్ సరిగ్గా సరిపోతారని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు.టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే మూడు వన్డేల సిరీస్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: