ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో మొదటిసారి కప్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) (RCB) చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలను సాకారం చేస్తూ గెలుపు పతాకాన్ని ఎగరేసింది. అయితే ఆ విజయోత్సవం తర్వాత జరిగిన విషాద ఘటన కారణంగా జట్టు సోషల్ మీడియా వేదికలు మూడు నెలల పాటు స్తబ్దుగా మారాయి. తాజాగా ఆ మౌనాన్ని చెరిపేసి, ఒక కీలక ప్రకటన చేసింది.విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో ఆనందాన్ని పంచుకోవడానికి చేరుకున్న కుటుంబాలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సంఘటన కేవలం కర్ణాటక రాష్ట్రానికే కాకుండా, మొత్తం దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
అభిమానుల ప్రాణనష్టం
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. ఆర్‌సీబీ టీమ్ మేనేజర్‌తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్‌పై కేసులు నమోదు చేసింది. అంతేకాదు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత పోలీస్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని గుర్తించి వారిపైన కూడా శిక్షణాత్మక చర్యలు తీసుకుంది. అభిమానుల ప్రాణనష్టం కారణంగా కేవలం క్రీడా విజయోత్సవం మాత్రమే కాకుండా, మొత్తం జట్టుపై దుఃఖం మబ్బులా కమ్ముకుంది.ఈ ఘటనలో మృతి చెందిన వారికి, గాయపడిన వారికి కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆర్‌సీబీ ఆర్థిక సాయం ప్రకటించింది. మరింత ఆర్థిక సాయం చేసేందుకు ఆర్‌సీబీ కేర్స్ (RCB Cares) ద్వారా ఫండ్ రైజింగ్ క్యాంపైన్ నిర్వహించింది. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టని ఆర్‌సీబీ.. ఇన్నాళ్లకు ఆర్‌సీబీ కేర్స్ గురించి చెబుతూ ఓ ప్రకటన చేసింది.
Dear 12th Man Army, this is our heartfelt letter to you!
— Royal Challengers Bengaluru (@RCBTweets) August 28, 2025
????????’???? ???????????????? ???????????????????? ???????? ???????????????????? ???????????????????????? ???????????????????? ???????? ???????????????? ???????????????????????? ????????????????.
The Silence wasn’t Absence. It was Grief.
This space was once filled with energy, memories and moments that you… pic.twitter.com/g0lOXAuYbd
విచారం వ్యక్తం చేసిన ఆర్‌సీబీ
‘ప్రియమైన 12వ మ్యాన్ ఆర్మీ(అభిమానులు)..ఇ ది మీకు మా హృదయపూర్వక లేఖ! ఇక్కడ మేము చివరిగా పోస్ట్ చేసి దాదాపు మూడు నెలలు (3 Months) అవుతోంది. మీకు దూరంగా ఉండాలని ఇలా చేయలేదు. దుఃఖంతోనే ఇలా చేశాం. ఈ వేదిక ఒకప్పుడు ఉత్సాహంగా, మధుర జ్ఞాపకాలతో, మీరు ఆస్వాదించిన క్షణాలతో కనిపించేది. కానీ జూన్ 4వ తేదీన చోటు చేసుకున్న ఘటన ఒక్కసారిగా అన్నింటినీ మార్చేసింది.ఆ దురదృష్టకర ఘటన మా గుండెలను ముక్కలు చేసింది. ఆ బాధను భరించేందుకే మేం ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. ఈ సమయంలో మేం ఎంతో ఏడ్చాం. ఎన్నో విషయాలు విన్నా.. నేర్చుకున్నాం. ఈ ప్రక్రియలోనే ఆర్‌సీబీ కేర్ పురుడు పోసుకుంది. అభిమానులను గౌరవించాలని, అండగా నిలబడాలనే అవసరం నుంచి పుట్టింది. మా అభిమానుల కోసం నిర్వహించే కార్యక్రమాల కోసమే ఈ వేదికను ఏర్పాటు చేశాం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేదికపైకి వచ్చాం. మీతో ఈ విషయాన్ని పంచుకోవడానికి, అండగా నిలబడటానికి, కలిసి ముందుకు నడవడానికి, కర్ణాటకను గర్వంగా నిలబెట్టేందుకు ఆర్‌సీబీ కేర్స్ పనిచేస్తోంది.’అని ఆర్‌సీబీ ఆ పోస్ట్‌లో పేర్కొంది.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: