రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించిన మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఆకస్మికంగా తన పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు క్రికెట్ అభిమానులు, విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా, జట్టు విజయానికి మూలస్తంభంగా నిలిచిన ద్రవిడ్ రాజీనామా ఎందుకు చేశాడు? అనే ప్రశ్న అందరి నోటా వినిపిస్తోంది.రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌తో రాహుల్ ద్రవిడ్ మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయని పలు వర్గాలు చెబుతున్నాయి. ఆటగాళ్ల ఎంపిక, జట్టు కాంబినేషన్ వంటి విషయాల్లో ఇద్దరి మధ్య అసమ్మతి చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కీలక మ్యాచ్‌లలో నిర్ణయాలు తీసుకోవడంలో విభేదాలు మరింత పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ద్రవిడ్ తన పదవి నుంచి తప్పుకోవడం సహజమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన
రాజస్థాన్ రాయల్స్ తమ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేస్తూ, “రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా మా ఫ్రాంచైజీకి విలువైన సేవలు అందించారు. ఆయన నాయకత్వం, ఆటగాళ్లను ప్రోత్సహించే తీరుకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. జట్టులో మరో ఉన్నతమైన స్థానాన్ని అందించాలనుకున్నప్పటికీ, ద్రవిడ్ స్వీకరించలేదు” అని వెల్లడించింది. ఈ ప్రకటనతో ఆయన రాజీనామా నిజమని తేలిపోయింది.జట్టుకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు చెప్పింది.అయితే సంజూ శాంసన్ (Sanju Samson) ట్రేడింగ్ వార్తల నేపథ్యంలోనే ద్రవిడ్ తప్పుకున్నాడా? అనే చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ముందు తనను రిలీజ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్‌ను సంజూ కోరినట్లు వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్లేందుకు అతను సుముఖంగా ఉన్నాడని, ఆ జట్టు కూడా ట్రేడింగ్ డీల్‌పై చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరిన ద్రవిడ్
అయితే సంజూకు బదులు మరో ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ కోరడంతో సీఎస్‌కే వెనుకడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి.సంజూ శాంసన్‌తో విభేదాలు, రాజస్థాన్ అదనపు బాధ్యతలు ఇస్తామని చెప్పడంతోనే ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2011లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టులో చేరిన ద్రవిడ్.. 2013 వరకు ఆటగాడిగా కొనసాగాడు. ఆ తర్వాత 2014 2015 సీజన్లలో కోచ్‌గా వ్యవహరించాడు. అనంతరం 2015 2024 వరకు బీసీసీఐలో పలు హోదాల్లో పనిచేశాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా, భారత్ ఏ కోచ్‌గా, టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2024 టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. అనంతరం అతనికి ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ద్రవిడ్ మాత్రం తిరిగి రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే చేరాడు. కానీ అతని పదవి కాలం అనూహ్యంగా ఏడాదికే పరిమితమైంది.
రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను మరో జట్టుకు కోచ్‌గా వ్వవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి.రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లే ఆడాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో సంజూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడగా.. రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచిన రాజస్థాన్.. పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానానికి పడిపోయింది. జోస్ బట్లర్‌ను రిటైన్ చేసుకోకపోవడాన్ని సంజూ శాంసన్ తప్పుబట్టాడని, ఈ విషయంలోనే అతనికి ద్రవిడ్ విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.
రాహుల్ ద్రవిడ్ పూర్తి పేరు ఏమిటి?
రాహుల్ శరద్ ద్రవిడ్.
రాహుల్ ద్రవిడ్ ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు?
1973 జనవరి 11న, ఇండోర్ (మధ్యప్రదేశ్)లో జన్మించాడు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: