టీమిండియాకు సుదీర్ఘకాలం సేవలందించిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) బుధవారం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 42 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, తన 25 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో అనేక మధుర క్షణాలను గుర్తు చేసుకున్నాడు. అయితే రిటైర్మెంట్ సందర్భంలో మీడియాతో మాట్లాడిన అమిత్ మిశ్రా, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అమిత్ మిశ్రా మాటల్లో ముఖ్యంగా వినిపించిన అంశం – “టీమిండియాలో అవకాశాలు ప్రతిభ ఆధారంగా కాకుండా, కెప్టెన్ల ఇష్టం మీదే ఎక్కువగా లభిస్తాయి. ఒక ఆటగాడిని కెప్టెన్ ఇష్టపడితే అతనికి మళ్లీ మళ్లీ ఛాన్స్ వస్తుంది. కానీ నచ్చకపోతే ఎలాంటి ప్రతిభ ఉన్నా, జట్టులో స్థానం దొరకదు” అని చెప్పడం. ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి.
25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం
తన 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్ తరఫున 22 టెస్ట్‌లు, 36 వన్డేలు, 10 టీ20 మాత్రమే ఆడి వరుసగా 76, 64, 16 వికెట్లు పడగొట్టాడు. గాయాల బెడదతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.రిటైర్మెంట్ నేపథ్యంలో ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా.. తనకు టీమిండియా (Team India) లో తక్కువ అవకాశాలు రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘టీమిండియాలో వరుసగా అవకాశాలు రాకపోతే ఏ ఆటగాడికైనా నిరాశ కలుగుతోంది.
ఒక్కోసారి జట్టులో ఉంటాం..మరోసారి ఉండం. తుది జట్టులోనూ ఒకసారి అవకాశం దక్కుతుంది. మరొకసారి దక్కదు. సహజంగానే ఇది చాలా నిరాశకు గురి చేస్తోంది. నేను కూడా చాలా సార్లు నిరాశకు గురయ్యాను.కానీ అదే సమయంలో భారత్ జట్టుకు ఆడటం కల అని, భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు లక్షలాది మంది పోటీ పడుతున్నారని, అలాంటి 15 మంది జట్టులో నువ్వు ఒకడిగా ఉన్నావనే విషయాన్ని గ్రహించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించేవాడిని.ప్రతిభ ఉన్నా అవకాశాలు రాకపోవడంతో మానసికంగా చాలా కష్టంగా ఉండేది.

గాయాలే అడ్డుగా
నిరాశకు గురైనప్పుడుల్లా ఆటను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెట్టేవాడిని. అది ఫిట్‌నెస్, బ్యాటింగ్, బౌలింగ్ ఎదైనా మరింత మెరుగయ్యేందుకు కష్టపడేవాడిని. భారత జట్టు తరఫున అవకాశం దక్కినప్పుడల్లా నేను మెరుగ్గా రాణించాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కష్టపడటానికి ఎప్పుడూ వెనుకాడలేదు.కొంతమంది ఆటగాళ్లంటే కెప్టెన్లకు ఇష్టం. కాబట్టి వారికి వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి.
అయినా అదో పెద్ద విషయం కాదు. ఏదేమైనా మనల్ని మనం నిరూపించుకునే అవకాశం వస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపై అంతా ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ (IPL) లో నేను భారత స్టార్ ఆటగాళ్లను ఔట్ చేసినప్పుడు చాలా గర్వపడేవాడిని. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ళు ఏ క్షణంలోనైనా ఆట స్వరూపాన్ని మార్చేయగలరు.
అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసా
అనిల్ కుంబ్లే గాయంతో జట్టుకు దూరమవడంతో నాకు తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయమే అనిల్ భాయ్ గాయం గురించి జట్టుకు సమాచారమిచ్చారు. ఆస్ట్రేలియాపై అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసాను. అది నాకు గొప్ప జ్ఞాపకం. అనిల్ భాయ్ స్థానాన్ని భర్తీ చేయడం గొప్ప విషయం. ఒత్తిడిలోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాను.నేను సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలతో పాటు ధోనీ, రోహిత్, కోహ్లీ సారథ్యంలో మూడు దశాబ్దాల పాటు క్రికెట్ ఆడాను.
ఇప్పుడు ఆటకు దూరమవుతున్నాను. అందుకు భావోద్వేగంగా ఉన్నా.. క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. గౌరవం, గుర్తింపు దక్కాయి. ప్రతీ ఒక్కరికి ఘన వీడ్కోలు లభించదు. అయినా నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నేను మనసు పెట్టి ఆడాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అభిమానుల ప్రేమ, సహచరుల గౌరవాన్ని సంపాదించుకున్నాను. అది నా గొప్ప విజయం.’అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.
అమిత్ మిశ్రా ప్రత్యేకత ఏమిటి?
లెగ్ బ్రేక్ బౌలింగ్‌లో నైపుణ్యం కలిగి ఉండటం, ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు తీయగలగటం ఆయన ప్రత్యేకత.
ఆయన ఎప్పుడు జన్మించారు?
అమిత్ మిశ్రా 24 నవంబర్ 1982న హర్యానాలో జన్మించారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: