Kranti Gaud : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ తన ఆటతో దేశానికి గౌరవం తీసుకురావడమే కాకుండా, తన కుటుంబానికి న్యాయం కూడా సాధించి చూపించింది. 13 ఏళ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించబడిన ఆమె తండ్రి మున్నా సింగ్ గౌడ్‌ను తిరిగి పోలీస్ విభాగంలోకి తీసుకుంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన మున్నా సింగ్ గౌడ్ 2012లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. ఆ ఘటనతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. క్రాంతి సోదరులు కూలీ పనులు, బస్సు కండక్టర్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని నడిపారు. అయినా క్రాంతి మాత్రం పరిస్థితులకు లొంగకుండా క్రికెట్‌లో కఠిన సాధనతో జాతీయ జట్టుకు ఎంపికయ్యింది.
Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య
ఇటీవల ముగిసిన మహిళా వన్డే ప్రపంచకప్‌లో (Kranti Gaud) భారత జట్టు విజయంలో క్రాంతి కీలక పాత్ర పోషించింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసి జట్టు విజయానికి బలమైంది. ఈ నేపథ్యంలో ఆమెను సన్మానించిన సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ముందు తన కుటుంబ బాధలను వివరించింది. తన తండ్రి మళ్లీ పోలీస్ యూనిఫాం ధరించి గౌరవంగా పదవీ విరమణ చేయాలని కోరింది.
క్రాంతి విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, పోలీసు ప్రధాన కార్యాలయం మున్నా సింగ్ గౌడ్ పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, క్రాంతి ప్రతిభకు గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతిని కూడా అందజేసింది. ఇది క్రీడాకారులకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: