భారత క్రికెట్ కు గొప్ప సేవలందించిన విరాట్ కోహ్లి రిటైర్మెంట్ (virat kohli test retirement) ప్రకటించడంతో దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది. కోహ్లి అత్యుత్తమ ఆటగాడిగా మాత్రమే కాకుండా, అతని నిబద్ధత, క్రమశిక్షణ, పోటీదారుల్లో గౌరవం పొందేలా చేసిన నైజంతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. అతని రిటైర్మెంట్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ స్పందన తెలియజేశారు.
చంద్రబాబు & రేవంత్ స్పందన
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) మాట్లాడుతూ..“విరాట్ కోహ్లి దేశానికి గర్వకారణం. అతడి రిటైర్మెంట్‌తో భారత క్రీడల చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది” అని తెలిపారు. కోహ్లి భారత క్రికెట్ కు ఇచ్చిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth) కూడా కోహ్లిని ప్రశంసిస్తూ, అతడి క్రమశిక్షణ, నిబద్ధత వల్లనే అనేక రికార్డులు సాధించగలిగాడని కొనియాడారు.
వైఎస్ జగన్ స్పందన
కోహ్లిపై మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పందిస్తూ, “విరాట్ రికార్డులు అతడి గొప్పతనాన్ని చెబుతాయి. విరాట్ లెగసీ భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది,” అన్నారు. కోహ్లి ప్రతి మ్యాచ్ లో చూపిన నిబద్ధత, నాయకత్వం ఆటగాళ్లకే కాకుండా ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలిచింది. అతని క్రికెట్ జర్నీ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.
Read Also : PM Modi: ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ సందేశం..