భారత్ జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ సమరంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహమ్మద్ సిరాజ్ (Pacer Mohammed Siraj)పై విరాట్ కోహ్లీ (Virat Kohli) కీర్తిస్ధంభం కట్టాడు.ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టు చివరి రోజు ఉదయం, ఇంగ్లండ్‌కు విజయం కోసం కేవలం 35 పరుగులే అవసరం. చేతిలో నాలుగు వికెట్లు మిగిలి ఉన్నాయి. అనుభవజ్ఞులైన బాట్స్‌మెన్ క్రీజులో ఉన్నారు.అయితే ఆ సమయంలో సిరాజ్ చేసిన స్పెల్ నిజంగా మ్యాజిక్. కేవలం 9 పరుగులకే మూడు కీలక వికెట్లు పడగొట్టి, మ్యాచ్‌ను భారత్ దిశగా తిప్పాడు.ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం 104 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.ఐదు టెస్టుల సిరీస్ మొత్తంలో అతను 23 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్‌గా నిలిచాడు.బుమ్రా లేని లోటు అతను సమర్థవంతంగా పూడ్చాడు.

కోహ్లీ ఎక్స్‌లో పోస్ట్ – సిరాజ్ సర్వస్వాన్ని పణంగా పెడతాడు
ఈ విజయాన్ని పురస్కరించుకుని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో స్పందించాడు.
తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఇలా పోస్ట్ చేశాడు:
టీమిండియా అద్భుత విజయం సాధించింది.
సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల పోరాటం అసాధారణం.
ప్రత్యేకంగా సిరాజ్ ప్రదర్శన గర్వకారణం.
అతను జట్టు కోసం తన సర్వస్వాన్ని పణంగా పెడతాడు.
అభిమానుల హృదయాలు గెలుచుకున్న సిరాజ్
సిరాజ్ ప్రదర్శన కేవలం గణాంకాల్లోనే కాదు, భావోద్వేగంగా కూడా ఆకట్టుకుంది.తన బౌలింగ్‌లో ఉన్న దృఢ సంకల్పం, నిబద్ధత అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించింది.ఈ టెస్ట్ విజయం ద్వారా ఐదు మ్యాచ్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.ఇది జట్టు సంయుక్త పోరాటానికి ప్రతిఫలం.
సిరాజ్ – కొత్త యుగం పేసర్
ఈ సిరీస్ ద్వారా సిరాజ్ తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు.ప్లాన్‌తో బౌలింగ్, అటాకింగ్ మైండ్‌సెట్‌తో ప్రత్యర్థుల మీద ఒత్తిడిని పెంచాడు.బుమ్రా, షమీ లాంటి సీనియర్‌లు అందుబాటులో లేని సమయంలో సిరాజ్ లాంటి పేసర్‌లు.జట్టు భవిష్యత్‌కు ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.విరాట్ కోహ్లీ కెప్టెన్సీ సమయంలో సిరాజ్‌కు మొదటిసారి అంతర్జాతీయ అవకాశాలు వచ్చాయి.ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కోహ్లీ చేసిన ఈ పోస్టుతో అది మరోసారి స్పష్టమైంది.
Read Also : Mohammed Siraj : సిరాజ్ పై తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రశంసలు