BCCI వైస్ ప్రెసిడెంట్ స్పందన
భారత క్రికెట్ స్టార్‌లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ(Kohli Rohit Retirement) త్వరలో రిటైర్ అవుతారని, ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ వీరి చివరిదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టత ఇచ్చారు.
Read also: AP Power Strike: ఏపీ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నిర్ణయం

“ఇద్దరూ జట్టుకు అవసరం” – రాజీవ్ శుక్లా
శుక్లా(Rajeev Shukla) మాట్లాడుతూ, “రోహిత్, కోహ్లీ ప్రెజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ టీమ్‌కి వెన్నెముకలాంటివారు. ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రిటైర్మెంట్(Kohli Rohit Retirement) అనేది పూర్తిగా ప్లేయర్ల నిర్ణయం. కానీ ఇది వారి చివరి సిరీస్ కాదు,” అని తెలిపారు.
ప్రచారాలకు తెర
అతను అభిమానులను రూమర్లను నమ్మవద్దని కోరారు. “ఇద్దరూ ఇంకా ఫిట్‌గా ఉన్నారు, టీమ్‌కి పెద్ద ఆస్తి. రిటైర్మెంట్ గురించి ఇప్పుడే చర్చ అవసరం లేదు,” అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: