టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దాదాపు ఆరు నెలల తర్వాత స్వదేశంలో అడుగు పెట్టాడు. ముంబై విమానాశ్రయంలో కోహ్లీని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కోసం కోహ్లీ స్వదేశానికి చేరుకోగా, కోహ్లీ (Virat Kohli) ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Read Also: Palash Muchhal: వదంతులను కొట్టి పారేసిన పలాష్ తల్లి అమితా ముచ్చల్
అభిమానులతో సెల్ఫీలు
ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చిన కోహ్లీ, మొదట ఫొటోలకు నిరాకరించి నేరుగా తన కారు వద్దకు వెళ్లాడు. అయితే, అభిమానులు కోరడంతో కాసేపటి తర్వాత కారు దిగి వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా కనిపించిన కోహ్లీ..
అక్కడున్న వారితో మాట్లాడటమే కాకుండా అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: