టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు.
అయితే ఈ సెంచరీతో పాటు టెస్ట్ క్రికెట్ (Test cricket) లో ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం రాహుల్ ప్రత్యేకత. టెస్ట్ క్రికెట్ 148 ఏళ్ల చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండుసార్లు 100 పరుగుల వద్ద ఔటైన తొలి ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.
Dhruv Jurel:వెస్టిండీస్‌తో టెస్టులో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలి సెంచరీ
197 బంతుల్లో 12 ఫోర్లతో 100 పరుగులు సాధించిన అతను, ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది (2025) రాహుల్ ఇలా 100 పరుగుల వద్ద ఔటవడం ఇది రెండోసారి. జులైలో ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో కూడా అతను సరిగ్గా 100 పరుగులకే వెనుదిరిగాడు.
1877లో టెస్ట్ క్రికెట్ (Test cricket in 1877) ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఒకే సంవత్సరంలో రెండుసార్లు ఇలా 100 పరుగుల వద్ద ఔటవలేదు.ఈ మ్యాచ్‌లో రాహుల్ సాధించింది అతని కెరీర్‌లో 11వ టెస్ట్ సెంచరీ కాగా, స్వదేశంలో ఇది రెండోది మాత్రమే.

భారత గడ్డపై అతను శతకం చేయడం ఇదే తొలిసారి
2016 తర్వాత భారత గడ్డపై అతను శతకం చేయడం ఇదే తొలిసారి.మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ (England) వంటి భిన్నమైన పరిస్థితుల్లో ఆడటం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు. “విరామం తర్వాత తిరిగి మైదానంలోకి రావడం ఆనందంగా ఉంది. ఇంగ్లాండ్‌లో పరుగులు చేయడం మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది.
ఇక్కడి పరిస్థితులు శారీరకంగా సవాలు విసిరాయి. ఈ సెంచరీని నా కూతురికి అంకితం ఇస్తున్నాను” అని రాహుల్ తెలిపాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో రాహుల్ 10 ఇన్నింగ్స్‌లలో 532 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Read Also: