టీమిండియా క్రికెటర్, కేఎల్ రాహుల్ (KL Rahul) పై దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) ప్రశంసల వర్షం కురిపించాడు. కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు నెమ్మదిగా ఆడాలో, ఎప్పుడు వేగంగా ఆడాలో బాగా తెలుసని డేల్ స్టెయిన్ అన్నాడు. బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శిస్తున్న అతడిని మెచ్చుకున్నాడు.. కేఎల్ రాహుల్‌కు ఎలా ఆడాలో బాగా తెలుసని,
Read Also: Virat Kohli: విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

ఎలాంటి పాత్ర పోషించాలో తెలుసు
ఒకవేళ అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే కచ్చితంగా సెంచరీలు సాధించగలడని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ప్రస్తుతం అతడు ఆడుతున్న స్థానాల్లో జట్టు కోసం తాను ఎలాంటి పాత్ర పోషించాలో కూడా తెలుసని పేర్కొన్నాడు. రెండు వన్డేలలో అతడు అర్ధ శతకాలు సాధించాడని స్టెయిన్ (Dale Steyn) గుర్తుచేశాడు. ఎప్పుడు ఎలా ఆడాలనే విషయంపై అతడికి ఒక అవగాహన ఉందని తెలిపాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: