కర్ణాటక (Karnataka) లోని, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలుకానుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ లు ఈ స్టేడియం లో నిర్వహించేందుకు,, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్‌లు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో నెలకొన్న అనిశ్చితికి ఈ అనుమతితో తెరపడింది.
Read Also: U19 World Cup controversy : అండర్-19 WCలో హ్యాండ్‌షేక్ వివాదం, బంగ్లా బోర్డు క్లారిటీ!
మైఖేల్ డి’కున్హా కమిటీ సిఫార్సులు
జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 56 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ… దులీప్ ట్రోఫీ, ఇండియా-సౌతాఫ్రికా ‘ఏ’ సిరీస్, విజయ్ హజారే ట్రోఫీతో పాటు 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సహా పలు కీలక టోర్నీలను చిన్నస్వామి నుంచి తరలించింది. ఈ విషాదంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ మైఖేల్ డి’కున్హా కమిటీ సిఫార్సులను అమలు చేస్తేనే మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, భద్రత, ప్రేక్షకుల నిర్వహణకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని కేఎస్‌సీఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ హామీ ఇచ్చారు.ప్రభుత్వం నుంచి అనుమతి లభించినప్పటికీ, ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లన్నీ చిన్నస్వామిలోనే ఆడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో నిర్వహించేందుకు ఆ జట్టు యాజమాన్యం ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: