ఢిల్లీ వీధుల్లోని కుక్కల (Dogs on the streets of Delhi) ను షెల్టర్ హోమ్స్‌కి తరలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) తన మనసు బహిర్గతం చేశారు. మూగ జీవాల పట్ల దయ చూపాలని, వాటికి గౌరవంగా బ్రతకే హక్కు కల్పించాలని ఆయన సూచించారు.ప్రముఖ జంతు సంక్షేమ సంస్థ పెట్ ఫ్యామిలియా విడుదల చేసిన వీడియోలో కపిల్ దేవ్ మాట్లాడారు. “వీధికుక్కల గురించి చాలా రకాలు వినిపిస్తున్నాయి. కానీ, ఇవి మన జీవితంలో ఒక భాగం. అవి కూడా మనలాంటి జీవులే. వాటిపై ప్రేమ చూపించాల్సిన బాధ్యత మనది” అని ఆవేదన వ్యక్తం చేశారు.కపిల్ దేవ్ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. “వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. బయటకు పంపేయకండి. వాటికీ జీవించడానికి హక్కు ఉంది. దయచేసి మెరుగైన జీవితం ఇవ్వండి” అంటూ అధికారులను కోరారు. ఈ మాటలు నెట్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సుప్రీం కోర్టు ఆగస్టు 11న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, వీధికుక్కలను బహిరంగ ప్రదేశాల నుంచి తొలగించాలి. జస్టిస్ జె.బి. పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ తీర్పు వివాదాస్పదమైంది. జంతు ప్రేమికులు, ఆర్గనైజేషన్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.తీర్పు ఇంకా అధికారికంగా విడుదల కాకముందే, కుక్కల పట్టింపు మొదలుపెట్టడంపై మరో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు త్వరగా స్పందించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

రేబీస్, కుక్కకాటు పై ఢిల్లీ ప్రభుత్వం వాదనలు
ఈ కేసు విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తరఫున వాదనలు వినిపించారు. కుక్కకాటు వల్ల చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. “రేబీస్ వ్యాధి విస్తరిస్తోంది. గత ఏడాది దేశంలో 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి” అని ఆయన తెలిపారు.”కేవలం స్టెరిలైజేషన్‌తో సమస్య పరిష్కారం కాదు. కోర్టు దీనిపై జోక్యం చేయాలి” అని విన్నవించారు.
కుక్కలకూ హక్కులు ఉన్నాయనే సంకేతం
ఈ వివాదం సమాజాన్ని రెండు వర్గాలుగా విభజించింది. ఒకవైపు సురక్షిత జీవనం కోసం కుక్కలను తొలగించాలన్న వాదన, మరోవైపు వాటిని హింసించకుండా ఆదుకోవాలన్న దృక్పథం. కపిల్ దేవ్ మాటలు మాత్రం మనసును తాకుతున్నాయి. “కుక్కలకీ మనలాగే హక్కులున్నాయి” అని ఆయన ఇచ్చిన సందేశం చాలా మందిని ఆలోచింపజేస్తోంది.
Read Also :