ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 2026) మినీ వేలంకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లోనే అబుదాబిలోని ప్రతిష్టాత్మక ఎతిహాద్ స్టేడియం వేదికగా ఈ మినీ ఆక్షన్ ప్రారంభం కానుంది. ఈసారి వేలంలో మొత్తం 77 స్థానాల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఇందులో 110 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా.. 31 మందికి అవకాశం దక్కనుంది. 10 ఫ్రాంచైజీలు రూ. 237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
Read Also: Lionel Messi: నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ

భారత కాలమానం ప్రకారం మంగళవారం(డిసెంబర్ 16) మధ్యాహ్నం 2.30 గంటలకు (IPL 2026) మినీ వేలం ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ (Star Sports Channels) లో వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ రెండు వేదికలను సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సిందే. ప్రత్యేకమైన మొబైల్ రిఛార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఐపీఎల్ (IPL) ఎప్పుడు ప్రారంభమైంది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008లో ప్రారంభమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: