ఐపీఎల్ 2026 (IPL 2026) మినీ వేలంపై బీసీసీఐ (BCCI) కసరత్తులు ముమ్మరం చేసింది. రాబోయే సీజన్ కోసం జట్ల మధ్య వ్యూహాలు, మార్పులు, సంస్కరణలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. డిసెంబర్ 14న అబుదాబిలో జరగబోయే ఈ మినీ వేలం కోసం ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. వేలం నిర్వహణకు ముందుగా, 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 15లోపు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించేందుకు బీసీసీఐ డెడ్‌లైన్ ను విధించింది.
Read Also: IPL 2026: మ్యాక్స్‌వెల్‌ను వదిలేసిన పంజాబ్ కింగ్స్!
రిటెన్షన్‌పై ఎలాంటి కఠిన నిబంధనలు లేవు
మినీ వేలం కాబట్టి ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవు. ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. నచ్చని ఆటగాళ్లను వదిలేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితం లేదు. ఈ రిటెన్షన్ ప్రక్రియను ప్రకటించేలోపే ఆయా జట్లు తమ క్యాష్ ట్రేడింగ్ డీల్స్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
మినీ వేలం ముగిసే వరకు ట్రేడింగ్ విండో ముగిసిపోతుంది. ఆ తర్వాత మళ్లీ ప్లేయర్ ట్రేడింగ్‌కు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమ ట్రేడింగ్ డీల్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలను శనివారం సాయంత్ర 5 గంటలకు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ (Star Sports), జియో హాట్‌స్టార్ వేదికగా ప్రకటించనున్నారు.

రిలీజ్ ఆటగాళ్ల వివరాలను వెల్లడించనున్నారు
10 జట్ల రిటెన్షన్ లిస్ట్‌తో పాటు, రిలీజ్ ఆటగాళ్ల వివరాలను వెల్లడించనున్నారు. ఈ రెండు వేదికల్లో చూడాలంటి డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్ ద్వారా జియో హాట్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఐపీఎల్ 2025 (IPL 2025) విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రన్నరప్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మినహా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: