ఐపీఎల్ 2026 ( IPL 2026) సీజన్‌కు ముందుగా జరగబోయే మినీ వేలం కోసం క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు పలు దేశాల నుండి మొత్తం 1,355 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, ఫ్రాంచైజీలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఆ లిస్టును BCCI 350 మందికి కుదించింది.
Read Also: T20: నేడే IND vs SA తొలి టీ20..

అబుదాబి వేదికగా IPL వేలం
ఈ (IPL 2026) లిస్టులో తొలుత పేరు నమోదు చేసుకోని 35 మంది కొత్త ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఉంది. అతని బేస్ ధర రూ.కోటిగా నిర్ణయించారు. DEC 16న 2.30PMకు అబుదాబి వేదికగా IPL వేలం జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: